మృణాల్ ఠాగూర్ అలాంటి వింత వ్యాధితో బాధపడుతుందా..?

సీతారామమ్‌ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది మృణాల్‌ ఠాగూర్. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా మారింది. అనురాగవపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ముద్దుగుమ్మ మొదటి సినిమాలో మహాలక్ష్మి పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

నాని హీరోగా నటిస్తున్న ఆయన సినిమాలో ఇటీవల నటించిన ఈ ముద్దుగుమ్మ చాలా కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అయితే ఓవైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకి సంబంధించిన ప్రతి అప్డేట్ ను ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఇక ప్రతిరోజు తనకు సంబంధించిన క్రేజీ ఫోటోలను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా అభిమానులను కవ్విస్తుంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

మృణాల్‌కు అరుదైన వ్యాధి ఉందట. ఈ అందాల తారకి రేచీకటి ఉందని తెలుస్తుంది. గత కొంతకాలంగా ఈ ప్రాబ్లమ్‌తో చాలా ఇబ్బంది పడుతుందని సమాచారం. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం మృణాల్ ఠాగూర్ హాయ్ నాన్న సినిమాతో పాటు హిందీలో కూడా నటిస్తుంది. ఈ సినిమాల్లో మృణాల్ రేచీకటి ఉన్న అమ్మాయిలాగా కనిపించబోతుంది. ఈ సినిమాలోనే తన రేచీకరితో బాధపడుతున్న అమ్మాయిలాగా కనిపించబోతుందట.