ఆ హీరోకీ బుద్ధి చెప్పడానికి రాజమౌళి ఈగ సినిమాని చేశారా..!!

టాలీవుడ్ లోని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ రాజమౌళి.. రాజమౌళి సినిమాలు లేకపోతే తెలుగు ఇండస్ట్రీకి ఇంతటి పాపులారిటీ అందుకోవడం కష్టమని చెప్పవచ్చు. చాలామంది హీరోలు సైతం తమ వల్లే సినిమాలో హిట్ అయ్యాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి హీరోలకు సైతం బుద్ధి చెప్పడం కోసమే రాజమౌళి ఈగ అనే సినిమాను తెరకెక్కించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కేవలం ఈగతో 50 కోట్ల రూపాయలను కొల్లగొట్టి తన స్టామినా ఏంటో చూపించారు.

రాజమౌళి మేకింగ్ లో నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈగ సినిమాని చేయాలి అంటే చాలా గట్స్ ఉండాలి.. ఇలాంటి సమయంలోనే ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే అది డైరెక్టర్ వల్ల అయిందని చాలా తక్కువ మంది మాత్రమే నమ్ముతూ ఉంటారు.. మేము లేకపోతే ఈ సినిమాలు లేవు అని గర్వంతో ఫీలయ్యే హీరోలు ఉన్నంతకాలం ఆ హీరోకి సరైన సక్సెస్ లు రావాలి చెప్పవచ్చు.

ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలామంది హీరోల అభిమానులు కూడా సినిమా అంటే మా హీరో సినిమా నే అంటూ బ్రమలోనే ఉంటున్నారు. గతంలో ఒకసారి హీరోతో రాజమౌళి సినిమా తెరకెక్కించడం వల్ల.. ఆ స్టార్ హీరో ఫ్యామిలీ తమ హీరో లేకపోతే ఈ సినిమా సక్సెస్ అయ్యేది కాదని చాలా విర్రవీగడం జరిగిందట..దీంతో రాజమౌళి అలాంటి కోపంతోనే మీ హీరోని పెట్టి కాదు ఈగతో సినిమా తీస్తానని చెప్పి ఈగ సినిమాని చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఆ హీరో పలు రకాల సినిమాలు చేస్తే బిజీగా ఉన్నారు.