సినిమాపై బాధ్యతగా ఎలా ఉండాలో నాన్న నుంచి నేర్చుకున్నా.. మహేష్ సెన్సేషనల్ కామెంట్స్…!!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బాబుకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇక రీల్ లైఫ్ లో మాత్రమే కాదు.. వేలాది మందికి సహాయం చేసి రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకున్నాడు. తాజాగా మహేష్ బాబు కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి మహేష్ దంపతులు హాజరయ్యారు.

 

 

ఈ సందర్భంగా మహేష్ బాబు.. తండ్రి కృష్ణను గుర్తు చేసుకున్నారు.” నేను నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే నేను చాలా బాధ పడతాను. ఎందుకంటే ఒక సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. దీని వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది. అందుకని దాని పూర్తి బాధ్యత నేను చూసుకుంటాను. మనం స్టార్ హీరోలం అయినప్పుడు ఒత్తిడిని అంగీకరించాలి.

ఈ విషయం నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాకు క్రమశిక్షణ, వినయం ప్రాముఖ్యతను ఆయనే నేర్పించారు. ఎలాంటి విజయం అయినా ఒకేసారి రాదని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే వరిస్తుందని చెప్పారు. అప్పటినుంచి నా సినిమా నా బాధ్యత అని అనుకుంటా ” అంటూ చెప్పుకొచ్చాడు మహేష్. ప్రస్తుతం మహేష్ బాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.