వామ్మో..నేషనల్ మీడియాతో అలా మాట్లాడిన అల్లు అర్జున్.. పుష్పగాడు పూనాడా ఏంటి బన్నీ(వీడియో)..!

ఐకాన్ హీరో అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప ది రైజ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . ఎన్నో సంచలన అవార్డులను అందుకుంది. రీసెంట్గా పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటించిన అందుకు గాను అవార్డు వరించింది . 69 వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారం నిన్న అక్టోబర్ 17 సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో చాలా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . ఈ క్రమంలోనే నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న అందరూ అవార్డులు అందుకోవడానికి వచ్చారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు అందరూ తమ అవార్డులను అందుకున్నారు . 2021 సంవత్సరానికి గాను వచ్చిన అవార్డులలో పుష్ప సినిమాకు గాను బన్నీ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు . టాలీవుడ్ నుంచి మొట్టమొదటిసారి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న చరిత్ర బన్నీ సృష్టించాడు . ఈ క్రమంలోనే అక్కడ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ బన్నీ చాలా చాలా ధైర్యంగా బోల్డ్ గా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు .

ఎంత పెద్ద హీరో అయినా సరే ఒక్కసారిగా పెద్ద మీడియాతో మాట్లాడుతున్నప్పుడు షివరింగ్ వస్తుంది . కానీ బన్నీ మాత్రం ఏ మాత్రం తడుముకోకుండా .. చాలా చాలా ఓపెన్ గా ధైర్యంగా మాట్లాడాడు . “ఈ అవార్డు రావడం పట్ల నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను .. అంతేకాకుండా కమర్షియల్ సినిమాకి అవార్డు అందుకోవడం నాకు పెద్ద అచీవ్మెంట్ అనిపిస్తుంది..”అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు పుష్ప నుండి ఏదైనా డైలాగ్ చెప్పు అని బన్నీని అడగ్గానే “తగ్గేదేలా” అంటూ తన మేనరిజంలో చేసి చూపించాడు బన్నీ .దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది..!!