మ‌హేష్ బాబు ధ‌రించిన ఆ స్వెటర్ ధ‌రెంతో తెలుసా.. ఐఫోన్ కొనేయొచ్చు!

టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల లిస్ట్ తీస్తే అందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పేరు ముందు ఉంటుంది. మూవీ ల‌వ‌ర్స్‌, ఫ్యాన్సే కాకుండా ఎంద‌రో సెల‌బ్రిటీలు కూడా మ‌హేష్ అందానికి ద‌సోహం అంటూ ఓపెన్‌గానే చెప్పేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ఓవైపు సినిమాలు.. మ‌రోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. అలాగే వ్యాపార‌వేత్త‌గానూ స‌త్తా చాటుతున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా `హలో` మ్యాగజైన్ కోసం మ‌హేష్ బాబు షోటో షూట్ చేశాడు. డిఫ్ర‌డెంట్ డ్రెస్సుల్లో సూప‌ర్ స్టైలిష్ గా ఫోటోల‌కు ఫోజులిచ్చింది. ఫైరింగ్ లుక్స్ తో ప‌రేషాన్ చేశాడు. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ పిక్స్ లో మ‌హేష్ బాబు ధ‌రించిన స్వెట‌ర్ ధ‌ర హాట్ టాపిక్ గా మారింది.

హ‌లో మ్యాగేజైన్ కోసం చేసిన ఫోటో షూట్ లో లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందిన మల్టీ కలర్ డిస్టర్టెడ్ జెయింట్ డామియర్ స్వెటర్‌ ధరించి హ్యాండ్స‌మ్ గా ద‌ర్శ‌న‌మిచ్చాడు. అయితే ఈ స్వెట‌ర్ ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది. ఎందుకుంటే, రూ. 1,04,041. అంటే ల‌క్ష రూపాయిల‌కు పైమాటే. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మ‌హేస్ స్వెట‌ర్ కాస్ట్ తో ఒక మంచి ఐఫోన్ కొనేయెచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `గుంటూరు కారం` మూవీ చేస్తున్నాడు. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.