టిని ఎక్కువసార్లు వేడి చేసి తాగడం ఎంత ప్రమాదమో తెలుసా..?

ఉదయం లేవగానే చాలా మంది బెడ్ కాఫీ, టీ లేదా వంటి వాటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు.. చాలా మంది టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ నిపుణులు మాత్రం పదే పదే టీ తాగడం మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నారు. ఇలా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయని తెలియజేస్తున్నారు. దీని పదే పదే వేడి చేసి తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటూ తెలుపుతున్నారు. అయితే ఇలా తాగుతున్న వారికి ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

ప్రతిసారి వేడి చేసే టీ ని తాగితే అందులో ఉండే పోషకాలు సైతం నశిస్తాయి.. రుచి మారిపోవడమే కాకుండా వాసన కూడా తగ్గిపోతుంది.. ఫ్రెష్ గా తయారు చేసిన టి కంటే మళ్లీ వేడి చేసినప్పుడు తాగితే ఆ టీ కి పెద్దగా టేస్ట్ ఉండదు. టి ఒక్కసారి చేసిన తర్వాత గంట లేదా రెండు గంటల వరకు ఉంచి ఒక్కసారి మాత్రమే వేడి చేసుకుని తాగాలి ముఖ్యంగా పాలు చేర్చిన బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందట. వేడి చేసేటప్పుడు చక్కెర వేస్తే అందులో కొన్ని రకాల క్రిములు కూడా పెరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

పాలు చక్కెర టీ కలిసినప్పుడు ఆవి వేగంగా చెడిపోవడానికి దారితీస్తుంది. ఇది తలనొప్పి లేదా కడుపులో వచ్చేటువంటి నొప్పులతో దుష్ప్రభావాలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.అందుకే ఎవరైనా సరే టీ నీ ఒక్కసారి చేసుకొని తాగడం చాలా మంచిదట. మళ్లీమళ్లీ వేడి చేసి తాగితే చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.