సినిమా పేరు మర్చిపోయిన పవన్..”నోర్లు మూయించే ఆన్సర్ ఇచ్చిన హారిష్”.. అంత మాట అనేశావు ఏంటి బ్రో..?

రీసెంట్గా పవన్ కళ్యాణ్  ఓ స్టేజిపై మాట్లాడుతూ తాను వర్క్ చేస్తున్న సినిమా నిర్మాతల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయబోయాడు.  అయితే ఇదే క్రమంలో ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పేరును సర్దార్ భగత్ సింగ్ అంటూ తప్పు పలికాడు . అప్పట్నుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేస్తున్నారు జనాలు.

జనరల్ గా పవన్ కళ్యాణ్ తప్పు చేయడు.. ఎప్పుడో ఒకసారి అలా మాట తూలాడా ..దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కొందరు ఆకతాయిలు . అందుకే పవన్ కళ్యాణ్ లేకలేక దొరికిపోవడంతో తెగ ట్రోల్ చేస్తున్నారు . ఎప్పుడెప్పుడో మ్యాటర్స్ ని తవ్వి.. లోడి..  బయటకు తీస్తూ ఆ విషయాలకు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు లింక్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హరిష్ శంకర్ ఓపికగా సహనంగా ఎదురు చూశారు . అయితే హేటర్స్ మరింత రెచ్చిపోవడంతో హరీష్ శంకర్ సైతం ఒకే ఒక్క ఆన్సర్ తో నోర్లు మూయించేసాడు. “బహుశా పవన్ కళ్యాణ్ ఒరిజినల్ టైటిల్ చెప్పినా కూడా ఇంత వైరల్ అయి ఉండేది కాదేమో..?” అంటూ కామెంట్ చేస్తూ.. ఆ వీడియోకి కౌంటర్ వేశారు .  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరిష్ శంకర్ ఆన్సర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఒక్కొక్కడికి పగిలిపోయి నోరు మూయించే ఆన్సర్ ఇచ్చావు అన్నా అంటూ హరిష్ శంకర్ ను పొగిడేస్తున్నారు ..!!