చనిపోయి 27 నిమిషాలకు బతికి వచ్చిన మహిళ.. ఆమె చెప్పిందంటే షాక్ అవుతారు..?

టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా.. ? చనిపోయిన 27 నిమిషాలకు మహిళా బతికి రావడం ఏంటి.. ? ఆమె మాట్లాడటం ఏంటి.. అనుకుంటున్నారా. ఇది నిజంగానే జరిగింది. యూఎస్ లో మహిళ చనిపోయిందని నిర్ధారించిన 27ని.. తర్వాత బతికింది. టీనా అనే 56 ఏళ్ల మహిళను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు వైద్య సిబంది ప్రకటించారు. అయితే ఆమె తిరిగి ప్రాణం పోసుకుంది. 2018 లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. 2018 ఫిబ్రవరి 13న టీనా కు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయింది. దీంతో టీనాను భర్త వేగంగా ఆసుపత్రికి తరలించాడు.

ఓ వ్యక్తికి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు పునరుద్ధరించడానికి కీలకమైన ఎమర్జెన్సీ ప్రాసెసర్ సిపిఆర్ నిర్వహించాలని అవగాహనతో ఆయన ఆ ప్రాసెసింగ్ చేశాడు. అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.. టీనా పరిస్థితి క్షీణించింది.. శరీరం బ్లూ కలర్ లోకి మారిపోయింది. ఇక ఆమె బ్రతికి ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆమెను రక్షించేందుకు వచ్చిన వైద్య సహాయక సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం కనిపించలేదు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లి డేఫిబ్రేటర్ షాక్‌ ఇచ్చేసరికి ఆశ్చర్యంగా గుండె మరోసారి కొట్టుకోవడం మొదలైంది.

చనిపోయినట్లు ప్రకటించిన 27 నిమిషాలకు ఆమె ప్రాణాలతో బయటపడటం డాక్టర్స్ ను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా మెదడుకు 5 నుంచి 10 నిమిషాల వరకు ఆక్సిజన్ అందకపోతే మనుషులు బ్రతకలేరు. టీనా విషయాంల్లో ఇది వైద్యుల‌కు కొత్త సవాళ్లను అందించింది. ఎక్కువ టైం మెదడుకు ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. దీంతో టీనా కోలుకోవడానికి వైద్య నిపుణులు ఆమెను మెడికల్ ఇండివిడ్ కోమాలో ఉంచారు. మరసటి రోజు టీనా కోమా నుంచి మేల్కొని తన చుట్టూ ఉన్నవారికి వెన్నలో వణుకు పుట్టించే న్యూస్ చెప్పింది.

ఆ టైంలో ఆమె మాట్లాడలేకపోవడంతో పెన్ను, పుస్తకం వైద్యులు అందించగా కొంచెం ఆసక్తికరమైన చేతిరాతలో ఇది నిజమే అంటూ రాసుకొచ్చింది. ఆమె రాసిన దాన్ని అర్థం తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నించారు. చివరికి ఆమె రాసిన దానికి అర్థం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. టీనా భర్త రియల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి పలు ప్రశ్నలు అడగగా ఆమె అన్నిటికి నో అంటూ తల ఊపింది. అయితే స్వర్గం అనగానే అవును అన్నట్లు ఆమె తల ఊపింది.

సాధారణంగా ఆమె అనుభవాన్ని వివరిస్తూ యేసు వెనుక ఒక ప్రకాశంవంతమైన శక్తివంతమైన ఎల్లో గ్లో లైట్ ను చూసినట్లు వివరించింది. దేవుని దయ, మంచితనం, ప్రేమకు నిదర్శనమైన ఒక మిరాకిల్ నన్ను బ్రతికించింది.. అందుకే నేను ప్రాణాలతో ఉన్నాను అంటూ టీనా చెప్పుకొచ్చింది. 27 నిమిషాల పాటు ఆమె శ్వాస తీసుకోలేదు మాటల్లో చెప్పాలంటే పరలోకపు తండ్రి నాకు తిరిగి జీవనం పోశాడు అంటూ ఆమె వివరించింది. ఇక నాలుగు రోజుల తర్వాత టీనా బ్రెయిన్ కి ఎలాంటి డామేజ్ లేదని వైద్యులను నిర్ధారించారు. తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.