మీరు అకస్మాత్తుగా లేచి నుంచుంటే కళ్ళు తిరుగుతున్నాయా.. కారణం ఇదే..

మీరు కూర్చొని లేదంటే పడుకుని అకస్మాత్తుగా మేలకువ రావటంతో.. ఒక్క క్షణం తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా. మీకు గతంలో ఇలాంటి సమస్య ఉన్నా మీరు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. అది కూడా ఒక అనారోగ్య సమస్యే అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనే వ్యాధి కారణంగా ఆకస్మిక తలనొప్పి, మైకము లాంటి లక్షణాలను కనిపిస్తాయి.. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనేది లో బిపి ల‌క్ష‌ణం. ఇది సాధారణంగా కూర్చోవడం, పడుకోవడం మరియు నిలబడి ఉన్నప్పుడు స‌డ‌న్‌గా జ‌రుగుతూ ఉంటుంది.

దీని కారణంగా వ్యక్తికి అకస్మాత్తుగా మైకంవ‌స్తుంది. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ని ఫిజికల్ హైపోటెన్షన్ అని కూడా అంటారు. ఒక వ్యక్తి కూర్చొని లేదా పడుకున్న తర్వాత రక్తపోటులో అకస్మాత్తుగా పడిపోయే ఒక అనారోగ్యం. రక్తపోటు తగ్గడం వల్ల కూడా కళ్లు తిరగడం, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనబ‌డ‌తాయి. ఎందుకంటే మీరు నిలబడి ఉన్నప్పుడు, గురుత్వాకర్షణ మీ బాడి క్రింది లోప‌ల‌ భాగాలలో బ్ల‌డ్‌ పూల్ చేస్తుంది. మెదడుకు రక్త ప్రవాహాన్ని తాత్కాలికంగా స్లో చేస్తుంది. దీనివల్ల తలతిరిగి మైకం క‌మ్ముతుంది.

ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్‌కు ప్రధాన కారణాలు ఇవే:

శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల బాడీ బ్ల‌డ్ లెవెల్స్ త‌గ్గుతాయి. అది శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రభావం చూపిస్తుంది. ఇది ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ స్థితికి కారణమవుతుంది. దీనికి వయస్సు కూడా స‌హ‌క‌రిస్తుంది. రక్త నాళాలు, నాడీ వ్యవస్థలో మార్పుల కారణంగా, పెద్ద‌వారిలో ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఏర్పడుతుంది. అలా వృదులు ఒక్కసారిగా లేచి నిల్చోవ‌డటంతో ఇబ్బంది పడుతుంటారు. దీర్ఘకాలం పాటు మంచం పట్టినవారు, ఎక్కువ సమయం పడుకున్న వారు తరచుగా తమ రక్తపోటును బ్యాలెన్స్ చేయ‌లేరు. ఇక దీంతో తల తిరగడం, మూర్ఛ వంటి లక్షణాలు క‌నిపిస్తాయి.సాధారణంగా దీనికి ప్రధాన చికిత్స వైద్యులను సంప్రదించడం ద్వారానే సాధ్యమవుతుందట‌.

కాబట్టి మీకు తీవ్రమైన సమస్య ఉంటే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. అదే సమయంలో, మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ఈ సమస్య నుండి కొంత రిలీఫ్‌ పొందవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు మంచం మీద నుండి నెమ్మదిగా లేవడం అల‌వ‌రుచుకోవాలి. అలా చేస్తే శరీరంలో రక్తపోటు పరిస్థితి త్వరగా మారదు. మీరు చుట్టుపక్కల పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను కంట్రోల్ చేయ‌వ‌చ్చు.ఈ రోజుల్లో అనేక సమస్యలకు ప్రధాన కారణం ఫుడ్‌. ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మన‌కు రక్తపోటు సమస్యలు వస్తాయి. మైకము, మూర్ఛ లాంటి సమస్యలు వ‌స్తాయి.