ఈ వయసులో కూడా ఇవేం ప‌నులురా సామి.. నాగార్జున పై ఫైర్ అవుతున్న నెట్టిజన్‌లు.. (వీడియో)

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న వారు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోలు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యంగ్ హీరోస్‌ల.. ఇప్పుడు ఉన్న కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ముద్దులు, హగ్ లతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే మన సీనియర్ హీరోలు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా నాగార్జున త‌ను చేసిన పనితో ప్రస్తుతం వార్తల‌లో నిలిచాడు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున బిగ్ బాస్ 7కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం, ఆదివారం వచ్చే ఈ ఎపిసోడ్‌ల‌కు నాగార్జున ఓ సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలోనే మన నవ మన్మధుడు ఇటీవల ఎంట్రీ సాంగ్ లో డాన్స్ చేస్తూ కో- డైరెక్టర్ కు ముద్దు ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు యంగ్ హీరోయిన్ కు హగ్, కిస్ ఇచ్చి మరోసారి నెట్టింట రచ్చలో ఇరుక్కున్నాడు. నవరాత్రి పండగ వేడుకలకు కళ్యాణ్ అనే వ్యక్తి ఇంటికి హాజరయ్యాడు నాగార్జున. ఆ పండగ వేడుకకు కత్రినా కైఫ్ కూడా హాజరు కావడంతో.. ఆమెను రిసీవ్ చేసుకునే క్రమంలో నాగార్జున హగ్, కిస్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ వయసులో ఇదేం పని రా బాబు.. అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)