చంద్రబాబు అరెస్ట్ వేళ‌ మోహన్ బాబు సెన్సేష‌న‌ల్ కామెంట్స్.. బాబు ఘోరంగా మోసం చేశాడంటూ..(వీడియో)

హెరిటేజ్ సంస్థ ఎవరిది అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు టక్కున చెప్పే ఆన్సర్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుది అని.. కానీ హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదు.. నాదేనని టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు ఆ సంస్థను లాక్కున్నాడని ఘూటు విమర్శలు చేశారు.
ఇటీవల ఆయన ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాడు.

చంద్రబాబు అరెస్ట్ అయిన నేప‌ద్యంలో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ” రాజకీయంగా, మానసికంగా చంద్రబాబు నన్ను దెబ్బతీశాడు. హెరిటేజ్ సంస్థ నాది. దానికి ఎక్కువ పెట్టుబడి పెట్టింది నేను. నా షేర్ ఎక్కువ. కానీ చంద్రబాబు నాయుడు దానిని లాక్కున్నాడు. వై యస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు వెళ్లేటప్పుడు మా ఇంటికి వచ్చాడని మోహ‌న్‌బాబు వివ‌రించాడు.

ఆ సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ..ఏమయా.. నువ్వు చంద్రబాబు ఫ్రెండ్స్ కదా.. మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని అడిగారు. అప్పుడు నేను హెరిటేజ్ గురించి చెప్పాను. దానికి ఆయన చంద్రబాబు ఆయన మామనే వెన్నుపోటు పొడిచాడు. ఆఫ్ట్రాల్ నిన్ను మోసం చేయడంలో కొత్త ఏముంది అన్నాడు ” అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మోహన్ బాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by YS Jagan Times (@ysjagantimes)