మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ థ‌మన్ ఎంతవరకు చదువుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!!

ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కొనసాగుతున్న థ‌మన్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన థ‌మన్ తన సొంత టాలెంట్ ను ఉపయోగించి అంచలంచలుగా ఎదుగుతూ ఈ రేంజ్ కి వచ్చాడు. అయితే మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న థ‌మన్ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.

అయితే ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ పాపులర్ సింగర్ గా మారిన థ‌మన్ కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఐదో తరగతిలోనే త‌ర చ‌దువుకి ఫుల్ స్టాప్ పెట్టాడు. థ‌మన్ వళ్ళ నాన్న‌కి డ్రమ్స్ ప్లే చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అట్టా.. ఆ ఇంట్రెస్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన థ‌మన్ తండ్రి 500 సినిమాల పాటలకు డ్రమ్స్ ప్లే చేశాడట. ఇక కొంత డబ్బు సంపాదించుకున్న థ‌మ‌న్‌ తండ్రి ఫ్యామిలీ సెటిల్ అవుతుంది అన్న సమయంలో ట్రైన్లో ప్రయాణిస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చి మరణించారు.

దీంతో చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన థ‌మన్ అప్పటినుంచి అర్దిక స‌మ‌స్య‌ల‌తో చదువు మానేసి ఇంటి బాధ్యతలను తనపై వేసుకొన్నాడు. డ్రమ్స్ ప్లే చేయడానికి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ల వద్దకు వెళ్లి ఛాన్స్ల కోసం ఇబ్బందులు పడ్డాడట అయితే థ‌మన్ లోని టాలెంట్ ని గుర్తించిన ఏ ఆర్ రెహమాన్, మణి శర్మ లాంటివారు థ‌మన్‌కు అవకాశం ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కారణమయ్యారు.