“సచ్చిన శవాన్నికి మ్యూజిక్ కొట్టమంటే ఎలా..?”..కోపంతో ఊగిపోయిన తమన్..ఒక్కోక్కడికి ఇచ్చిపడేసిండు..!!

ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం బాగా చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా స్కంద మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై చేసిన కామెంట్స్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న.. రీసెంట్గా ఆయన మ్యూజిక్ చేసిన భగవంత్ కేసరి సినిమా హిట్ అవ్వడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మాట్లాడుతూ పరోక్షకంగా బోయపాటి శ్రీను పై ఘాటుగా స్పందించారు .

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ..”ఓ డైరెక్టర్ రాసే సీన్ లో ఎమోషన్ లేకపోతే నేను ఎంత మ్యూజిక్ కొట్టిన వేస్ట్ ..అది వర్కౌట్ అవ్వదు. సచ్చిన శవాన్ని తీసుకొచ్చి బ్రతికించమంటే ఎలా..?  ప్రతి టెక్నీషియన్ ఆ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మి ఆ టైంకి తన బెస్ట్ ఇవ్వడానికి చూస్తారు ..తన వర్క్ బాగా లేదన్నారని ట్రోల్ చేశారని హర్ట్ అవ్వడం ఓకే “..

“కానీ , తాను పనిచేసిన సినిమాని, సన్నివేశాలని, టీం వర్క్స్ ని తక్కువ చేసేలా ఇలా కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ ..? మీరే చెప్పండి..?  అంటూ ఘాటుగా స్పందించారు . ఈ కామెంట్స్ పరోక్షకంగా బోయపాటి శ్రీనుకు తగిలేలా ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ హాట్ హాట్ గా ట్రోల్ చేస్తున్నారు..!!