చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్ కొట్టిన రజనీకాంత్.. ఆ మూవీ ఏంటో తెలుసా..!!

సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేతులు మారుతుంటాయి. కొన్ని కథలను దర్శకులు ఒక హీరో కోసం అనుకుంటారు కానీ ఏదో ఒక కారణం వల్ల ఆ హీరో సినిమాను రిజెక్ట్ చేస్తే అదే కథతో మరో హీరో వద్దకు వెళ్తుంటారు. ఇలా కథ చెబుతున్న క్రమంలో ఏ హీరో ఎస్ అంటే ఆ హీరోతో తెరకెక్కిస్తారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లోను అలాంటి సినిమా ఒకటి ఉంది. ఇక్కడ రజిని చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో రికార్డులు క్రియేట్ చేశాడు.

ఇంతకీ ఆ సినిమా ఏంటి? చిరంజీవి ఆ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశాడు? అనేది ఇప్పుడు చూద్దాం.. రజనీకాంత్ రికార్డులు క్రియేట్ చేసిన సినిమా మొదటిగా చిరంజీవి వద్దకు వెళ్ళింది. ఆ సినిమా మరేదో కాదు చంద్రముఖి. దర్శకుడు చిరంజీవికి స్టోరీ చెప్పిన తర్వాత ఈ సినిమా కన్నడ వర్షన్ చూడండి అంటూ చిరూతో చెప్పడంతో… ఆ మూవీ చూసిన చిరంజీవి ఈ సినిమా నాకు సెట్ అవ్వదు అంటూ రిజక్ట్ చేశాడు. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ ముణిచిత్ర తాల్ కు రీమేక్ గా తెరకెక్కింది. ముణిచిత్రలో శోభన ప్రధాన పాత్రలో నటించగా హీరోగా సురేష్ గోపి నటించాడు.

 

ఇక ఇదే కథతో కన్నడలో 2003లో ఆప్తమిత్ర అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్గా నటించింది. ఇక ఇదే సినిమాకు తెలుగు తమిళ్ భాషల్లో ఏకాకాలంలో చంద్రముఖి పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్గా రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక 2005లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.