భగవంత్ కేసరి.. సినిమా కాజల్ కి ప్లసా.. మైనసా..?

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంతోమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ పిక్ స్టేజ్ లో ఉండంగానే తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ కచ్లు ను వివాహం చేసుకొని ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడానికి కాస్త బరువు తగ్గి మొదలుపెట్టిన అవకాశాలు హీరోయిన్గా రాలేదు.. తాజాగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్యకు జోడిగా నటించింది.

గతంలో కూడా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో పలు రకాల క్రేజీ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం జరిగింది. దీంతో భగవంత్ కేసరి సినిమాలో అవకాశం రావడంతో సరేనని చెప్పింది. ఇందులో ఈమె పాత్ర హీరోయిన్ల డ్యూయెట్లకే పరిమితం కాదు ఈమె పాత్ర కీలకంగా ఉంటుందని చిత్ర బృందం తెలియజేస్తూ వచ్చింది. కానీ తీరా చూస్తే ఈమె పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ ప్రాధాన్యత కూడా లేని పాత్ర అన్నట్లుగా కాజల్ అభిమానులు తెలియజేస్తున్నారు

శ్రీలీలని బాలయ్యని మాత్రమే మంచి పాపులారిటీ అయ్యేలా చేశారని చెప్పవచ్చు. గట్టిగా చెబితే కాజల్ కు ఇందులో నాలుగైదు సీన్లు తప్ప ఎక్కువగా కనిపించలేదు.. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ టీం తెలియజేస్తున్న వాస్తవ లెక్కల ప్రకారం మాత్రం కలెక్షన్ కి చాలా దూరంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల సమయం నుంచి బాలయ్య, శ్రీలీల డైరెక్టర్ అనిల్ రావు పూడి హడావిడి చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో బాలయ్య శ్రీ లీల ముందు కాజల్ నటన తేలిపోయింది పైగా ఈమె పాత్రకి ప్రయారిటీ లేకపోవడంతో ఈమె గురించి ఎక్కడ ప్రస్తావన వినిపించలేదు. భగవంత్ కేసరి సినిమా కాజల్ అగర్వాల్ కెరియర్ కు మైనస్ గా మారిందని అభిమానులు తెలుపుతున్నారు.