అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `చంద్ర‌ముఖి 2`.. చీప్ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌!

2005లో వ‌చ్చిన సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `చంద్ర‌ముఖి`కి సీక్వెల్‌గా ద‌ర్శ‌కుడు పి.వాసు.. ఇటీవ‌ల `చంద్ర‌ముఖి 2` మూవీని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌ను పోషించింది. మహిమా నంబియార్, వడివేలు, లక్ష్మీ మీనన్, రాధికా శరత్‌కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

సెప్టెంబ‌ర్ 28న ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌లైన‌ చంద్ర‌ముఖి 2.. ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. చంద్ర‌ముఖి క‌థ‌నే అటు ఇటు మార్చి చంద్ర‌ముఖి 2ను తీశారు. దీంతో భారీ హోప్స్ తో థియేట‌ర్స్ కు వెళ్లిన ఆడియెన్స్ కు తీవ్ర నిరాశే ఎదురైంది. తొలి ఆట నుంచే నెగ‌టివ్ టాక్ ముట‌గ‌ట్టుకున్న చంద్ర‌ముఖి 2.. లాంగ్ వీకెండ్ తో విడుద‌లైనా బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మాత్రం స‌త్తా చాట‌లేక‌పోతోంది. తెలుగులో రూ. 11 కోట్ల టార్గెట్ లో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. ఇప్ప‌టి వ‌రకు క‌నీసం రూ. 4 కోట్లు కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా చంద్ర‌ముఖి 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 43 కోట్ల రేంజ్ లో ఉండ‌గా.. ఇప్ప‌టికి రూ. 20 కోట్లు మాత్ర‌మే వ‌సూల్ చేసింది. ఇక‌పోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఓ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది.చంద్రముఖి 2 డిజిట‌ల్ రైట్స్‌ను ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అది కూడా జ‌స్ట్ రూ. 8 కోట్ల‌కే. డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకోవ‌డంతో.. చాలా చీప్ ధ‌ర‌కే చంద్ర‌ముఖి 2 డిజిట‌ల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక థియేట‌ర్స్ లో ప‌ర్మామెన్స్ యావ‌రేజ్ గా ఉండ‌టంతో.. అక్టోబ‌ర్ మూడో వారంలోనే ఈ సినిమాను ఓటీటీలోకి దింప‌బోతున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.