రజినీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అమితాబచ్చన్.. అదిరిపోయే కాంబినేషన్ అంటూ..

కోలివుడ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. రూ.700 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ప్రొడ్యూసర్‌ల‌కు, డిస్ట్రిబ్యూటర్‌ల‌కు కాసుల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమా తర్వాత కూడా రజనీకాంత్‌కు, డైరెక్టర్ నెల్స‌న్‌కి అలానే సినిమాలో వర్క్ చేసిన చాలామందికి వాల్యుబుల్ గిఫ్ట్స్ ప్ర‌జెంట్ చేశాడు ప్రొడ్యూసర్. ఆ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇక ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా తన 170వ‌ సినిమా తలైవార్ 170గా వస్తుంది. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంది. దీంతో మూవీలో టాప్ స్టార్ సెలబ్రిటీస్ ని తీసుకుంటున్నారు. ఇప్పటికే రానా దగ్గుపాటి, మంజు వారియర్ లాంటి స్టార్స్ ఆన్ బోర్డులోకి వచ్చేసారు. వీరితో పాటు మరో ముఖ్యమైన క్యారెక్టర్ ను అనౌన్స్ చేసింది లైక ప్రొడక్షన్. ఈ సినిమాలో బిగ్ బి అమితాబచ్చన్ కూడా భాగం కాబోతున్నాడంటు లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది. అమితాబచ్చన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక ప్రస్తుతం రజిని సినిమాలో అమితాబ్ కూడా ఉన్నాడని తెలియడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ విరలవుతుంది. ఇద్దరు బడా హీరోలు ఒక్క సినిమాలో నటిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని తలైవార్, బిగ్ బి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదిరిపోయే కాంబినేష‌న్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజై జైలర్ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాలి.