” సలార్ ” మూవీ ట్రైలర్ లో సరికొత్త మార్పులు.. అవేంటో చూశారా..?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా మార్కెట్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ” సలార్ “అని చెప్పాలి. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనితో ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై మాసివ్ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా కూడా ప్రభాస్ నుంచి ఒక లార్జర్ రన్ లైఫ్ సినిమా.

మరి ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి ఆడియన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ రాగా.. ఈ టీజర్ తోనే ఇప్పుడు ఎన్నో థియరీలు కూడా వైరల్ గా మారాయి. ఇక ఈ టీజర్ విషయంలో మేకర్స్ అయితే సాలిడ్ మార్పులు చేశారు. మొట్ట మొదటిగా రిలీజ్ చేసిన టీజర్ లో ఇందులో కొన్ని విజువల్స్ నే మార్చేశారు.

గత టీజర్ లో కొన్ని బైక్ షాట్స్ కానీ కొందరు గుర్రాలతో కనిపించే సీన్స్ ని తొలగించి సలార్ సైన్యం తాలూకా ఆర్మీ విజువల్స్ ని యాడ్ చేశారు. అంతేకాకుండా వీటిలో నీల్ చెప్పిన తన డీసీ సినిమాలో తాలూకా డార్క్ కలర్ గ్రేడింగ్ కూడా కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా అయితే అప్పుడు పొందుపరిచిన సెప్టెంబర్ రిలీజ్ డేట్ ని కూడా తీసేసి డిసెంబర్ 22 డేట్ ని అయితే అప్డేట్ చేశారు. దీనితో మేకర్స్ సైలెంట్ గా చేసిన ఈ ఇంట్రెస్టింగ్ మార్పులు చేర్పులు క్రేజీగా మారాయి.