బాహుబలి మూవీలో అనుష్క రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ గురించి చెప్పాలి అంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాలి. దర్శక‌ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజై ఎంత బీభత్స‌వాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతోనే అప్పటివరకు కేవలం టాలీవుడ్ స్టార్ గా ఉన్న ప్రభాస్ అనుష్కలు పాన్ ఇండియా స్టార్ ఫిగర్లుగా మారిపోయారు. అలాగే సినిమాలో నటించిన రాణా దగ్గుబాటి, తమన్న, రమ్యకృష్ణ, సత్యరాజ్ ఇలా ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కింది. బాహుబలి సినిమాతో తెలుగు మూవీ ఖ్యాతి ఎక్కడికో వెళ్ళిపోయింది అనడంలో సందేహం లేదు. మొత్తం భారతదేశానికి అంత తెలుగోడి సత్తా చాటి చెప్పాడు రాజమౌళి.

 

అలాగే టాలీవుడ్ లో రెండు భాగాలకు వచ్చిన మొదటి సినిమా బాహుబలి నే. ఫస్ట్ పార్ట్ బాహుబలి ద బిగినింగ్ 2015లో రిలీజ్ అయింది. సెకండ్ పార్ట్ బాహుబలి 2 కంక్లూషన్ 2017 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్‌ చేశాయి. ఇటు బయ్యర్లు, అటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రలో దేవసేన ఒకటి అనుష్క ఈ రోల్‌లో న‌టించింది. ప్రభాస్ కు భార్యగా, తల్లిగా డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా మెప్పించింది.
ఫస్ట్ పార్ట్ లో బానిసగా డీగ్లామర్ లుక్ లో కనిపించిన అనుష్క.. సెకండ్ పార్ట్ లో అందమైన యువరాణిలా అంతే చక్కగా మెప్పించింది.

అయితే నిజానికి దేవసేన పాత్రకు ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదట. మొదటి రాజమౌళి ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటి ఐశ్వర్యరాయ్‌ని తీసుకోవాలి అనుకున్నాడట. ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా ప్రమోట్ చేయడానికి ఐశ్వర్యరాయ్ బాగా యూజ్‌ అవుతుందని క్యాలిక్యులేట్ చేసుకున్నాడట‌. కానీ ఐశ్వర్య అప్పటికే కూతురు ఆరాధ్య బాగోగులు చూసుకుంటూ ఇంటి పట్టానే ఉంటూ అదే రీజ‌న్‌తో కథ వినకుండానే దేవసేన పాత్రను రిజెక్ట్ చేసింది. ఇక‌ రాజమౌళి తర్వాత ఆప్షన్‌గా అనుష్క ను సెలెక్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.