ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన విరాట్ అనుష్క..!!

గత కొద్ది రోజుల క్రితం ముంబైలో విరాట్, అనుష్క ఒక హాస్పెటల్ నందు కనిపించడంతో ఆ సమయంలో అనుష్క కాస్త లావుగా కనిపించడంతో పలువురు ఫోటోగ్రాఫర్లు సైతం అనుష్క శర్మ గర్భవతి అవ్వడం వల్లే మీడియా కనిపించకుండా తిరుగుతున్నారంటూ పలు రకాలుగా వార్తలను సృష్టించారు..ఈ విషయం ప్రముఖ జాతీయ మీడియాలో అనేక రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో అనుష్క, విరాట్ దంపతులు రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం వైరల్ గా మారుతూనే ఉంది.

11 photos and videos take us inside Virat Kohli and Anushka Sharma's Mumbai  home | Architectural Digest India

త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ఈ దంపతులు ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అందరూ అనుకుంటున్నట్టుగానే అనుష్క శర్మ తాజాగా ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది.. ఒకవైపు ప్రెగ్నెన్సీ వార్తలు జోరుగా జరుగుతున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఇలా తెలియజేస్తూ.. అభిప్రాయాలు అనేవి వ్యక్తిగతం నుంచి వస్తాయి అని మీరు అర్థం చేసుకున్నప్పుడు వాటి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో కూడా మీకు అర్థం కావాల్సిన అవసరం ఉందంటూ పోస్ట్ చేసింది..

అనుష్క శర్మ పోస్టు గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అనుష్క ప్రెగ్నెన్సీ వార్తలను రూమర్స్ అంటూ కొట్టి పారేయకుండా ఇలా పోస్ట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అనే విషయం అభిమానులకు తెలియక సతమతమవుతున్నారు.మరి కొంతమంది ఇంతకు అనుష్క ప్రెగ్నెన్సీ వార్తల పైన స్పందించిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2017లో అనుష్క విరాట్ కోహ్లీ వివాహం చేసుకున్నారు ప్రస్తుతం వీరికి ఒక పాప ఉన్నది వీరిద్దరూ వస్తుంది లైఫ్ లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అడపాదడపా సినిమాలలో నటిస్తున్న అనుష్క శర్మ ఇటీవలే వాటికి కూడా గుడ్ బై చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.