నటసింహం నందమూరి బాలకృష్ణ విజయపరంపర కొనసాగిస్తున్నారు. బ్రేకుల్లేని హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత అఖండ, వీర సింహారెడ్డి, రీసెంట్ గా విడుదలైన భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య మళ్లీ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశాడు.
నిజానికి అఖండ దగ్గర నుంచి బాలయ్య తన పారితోషికాన్ని పెంచుకుంటూనే వస్తున్నారు. అఖండకు రూ. 10 కోట్లు తీసుకున్న బాలయ్య.. వీర సింహారెడ్డికి రూ. 14 కోట్లు, భగవంత్ కేసరికి రూ. 18 కోట్లు చొప్పున ఛార్జ్ చేశాడు. అయితే ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని బాబీ అలియాస్ కె.ఎస్ రవీంద్రతో చేయబోతున్నాడు. `ఎన్‌బీకే 109` వర్కింగ్ టైటిల్ తో ఇదివరకే ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ అనంతరం బాబీ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. అయితే బాలయ్య ఈ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, ఆయన ఏకంగా రూ. 28 కోట్లు పుచ్చుకుంటున్నాడని ఇన్‌సైడ్ జోరుగా ప్రచారం జరుగుతోంది. తన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే బాలయ్య ఆ రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నాడని సమాచారం.