” 1 నేనొక్కడినే ” నుంచి ” టైగర్ నాగేశ్వరరావు ” వరకు.. రిలీజ్ అయిన అనంతరం సీన్స్ కట్ చేసిన సినిమాలు ఇవే…!!

గతంలో కొన్ని సినిమాలు రిలీజ్ అనంతరం కొత్త సీన్లు యాడ్ చేయడం, ఉన్న సీన్లను కట్ చేయడం జరిగింది. ఈ లిస్టులో చూడాలని ఉంది, మిర్చి, శ్రీమంతుడు, ఎఫ్ 2 వంటి సినిమాలు ఉన్నాయి. విజయాన్ని సాధించిన సినిమాలకి సైతం సీన్లు కట్ చేసి.. రిపీట్ ఆడియన్స్ ని థియేటర్లకి వచ్చేలా చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు విజయాన్ని సైతం సాధించాయి. అయితే అలా రిలీజ్ కి తరువాత సీన్లు కట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. అర్జున్ రెడ్డి:


విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్లు రిలీజ్ కి అనంతరం కట్ చేయడం జరిగింది.

2. 1 నేనొక్కడినే:


మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈ సినిమాలోని కొన్ని సీన్లని డిలీట్ చేశారు మేకర్స్‌.

3. బ్రదర్స్:


సూర్య డబల్ రోల్ లో ప్లే చేసిన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. వెంటనే మేకర్స్ కొన్ని సీన్లను డిలీట్ చేశారు.

4. మసాలా:


వెంకటేష్, రామ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ ని దక్కించుకుంది. దీంతో ఈ సినిమాలోని కొన్ని సీన్లని డిలీట్ చేశారు.

5. టైగర్ నాగేశ్వరరావు:


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తాజాగా తెరకెక్కిన మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. అయితే రిలీజ్ కి ముందు రన్ టైం ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా లో కొన్ని సీన్స్ ని కట్ చేశారు మేకర్స్.

ఇలా రిలీజ్ కి తరువాత సీన్లు కట్ చేసి కొన్ని సూపర్ హిట్ కొడితే, మరికొన్ని మాత్రం బోల్తా పడ్డాయి. ఏదేమైనప్పటికీ పిల్లి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు.. ఓ సినిమాని చూసి మరో సినిమాని అలా తీర్చిదిద్దడం కరెక్ట్ కాదు.