సంక్రాంతి, దీపావళి, దసరా …. ఇలా ఏ పండుగ వచ్చిన, మంచి సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆ లుక్ ని తమ అభిమానులతో పంచుకోవడం ఎంజాయ్ చేస్తారు మన సెలెబ్రిటీలు. అదే జరిగింది ఈ దసరాకి కూడా. ఎందరో సినీ తారలు తమ తమ ఫెస్టివ్ లుక్స్ ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ధరించిన లెహంగా ఎంతటి సెన్సేషన్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా మరో సెలబ్రిటీ తన దసరా లుక్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కత్తిలాంటి చీరతో కుర్రాళ్లకు మతి పోగొడుతోంది. ఆమె ఎవరో కాదండి. బాలీవుడ్ భామ కత్రినా కైఫ్.
కత్రినా దసరా సందర్భంగా పసుపు రంగు చీరలో దర్శనమిచ్చింది. ఈ సారీలో కత్రీనా పాలరాతి శిల్పంలా మెరుస్తుంది. స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసలా ఉంది ఎప్పుడు వెస్ట్రన్ వేర్ లో కనపడే కత్రినా, ఇలా చీరలో ముస్తాబయ్యేసరికి, ఆమె అభిమానులు యమా ఖుషి అవుతున్నారు. కత్రినా ఈ శారీని ప్రముఖ బ్రాండ్ రో మాంగో కోసం ధరించింది. ఈ యెల్లో సారీకి మెరుస్తున్న గోల్డెన్ బోర్డర్ మరింత అందాన్ని ఇచ్చింది. యెల్లో సారీ తో అదే రంగు బ్లౌజ్ ధరించింది.
వాటితో పాటు మ్యాచింగ్ జ్యూవెలరీ కూడా ధరించింది. చక్కటి ఝంకాలు, అందమైన గాజులు, ఆ చీరకు సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. తన హెయిర్ స్టైల్ ని కూడా ఎంతో చక్కగా ప్రెసెంట్ చేసింది. ఈ ట్రేడిషనల్ లుక్ కి తగ్గట్టు పింక్ లిప్ స్టిక్, నుదిటికి యెర్రని బొట్టు, కంటికి కాటుక ధరించి అచ్చమైన భారతీయ మహిళగా ముస్తాబయింది కత్రినా. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పండగలు, పబ్బాలతో సంబంధం లేకుండా మన సెలబ్రిటీలు ఎల్లప్పుడూ ఇలాగే ముస్తాబైతే ఎంత బాగుంటుందో కదా.. .!