ఉపాసన తాత ఎంత తెలివైనవాడు అంటే.. పెళ్ళికి ముందే చరణ్ కి అలాంటి కండీషన్ పెట్టేశాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ .. ప్రెసెంట్ ఎలాంటి హై సినిమాలో నటిస్తున్నాడో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన రేంజ్ క్రేజ్ మొత్తం పెరిగిపోయింది .. మారిపోయింది సినిమాలో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా లోకేష్ కనగ రాజు దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు . ఇలాంటి క్రమంలోనే రాంచరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఉపాసన-చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రాంచరణ్ కంటే ఉపాసన వయసులో పెద్దది ..అయినా కూడా మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేసి మరి ఆమెను కోడలుగా అంగీకరించింది. అయితే చరణ్ ని ఉపాసనకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఉపాసన తాతగారు ప్రతాప్ రెడ్డి .. చరణ్ కి క్రేజీ కండిషన్ పెట్టారట.

జనరల్గా సినిమా ఇండస్ట్రీలో .. కోడలని ఇంటికే పరిమితం చేస్తారని.. వాళ్లకున్న టాలెంట్ బయటికి రానికుండా తొక్కేస్తారని.. అది మా ఉపాసన విషయంలో జరగకూడదు అని.. ఆమె ఎలా ఉండాలి అంటే అలా ఉండనివ్వాలి అని ..ఆమె పెళ్లి తర్వాత ఇండిపెండెంట్ గా ఉండేలా చరణ్ సపోర్ట్ చేయాలి అని ..చరణ్కి చిరంజీవికి ఒకేసారి చెప్పుకు వచ్చారట . ఈ క్రమంలోనే మొదటి నుంచి లేడీస్ ని ఎక్కువగా యాంకరేజ్ చేసే చిరంజీవి ఆ కండిషన్కు ఓకే చేసి మరి ఉపాసనని ఇంటికి కోడలిగా రప్పించుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!