కూతురు ఔట్ – కొడలు ఇన్..పెళ్లికి ముందే కోడలు పోస్ట్ కొట్టేసిన లావణ్య..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ .. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకున్న ఈయన .. నవంబర్ 1వ తేదీ గ్రాండ్గా ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ తెలుస్తుంది. అయితే ఈలోపే వరుణ్ తేజ్ తన భార్య స్థానాన్ని లావణ్య త్రిపాఠికిచ్చేసాడు .

అంతేకాదు మెగా కుటుంబం సైతం లావణ్య కు కొత్తకోడలు పోస్ట్ ఇచ్చేసింది . ఈరోజు వినాయక చవితి పూజలు కొత్త కోడలు మెగా కుటుంబంతో చేసుకుంది. నాగబాబు.. పద్మ.. వరుణ్ ..లావణ్య త్రిపాఠి కలిసి దిగ్గిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్ళికి ముందే మెగా కోడలు ఇలా ఇంట్లో పూజ చేయడంపై పలువురు ఫన్నీగా కామెంట్ చేస్తుంటే..

మరి కొందరు నిహారిక అమెరికాలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ కోడలు ఇన్ ..కూతురు అవుట్ .. ఇదే మెగా సంప్రదాయం అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇస్తున్నారు . మొత్తానికి లావణ్య -వరుణ్ జంట అయితే అద్దిరిపోయింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!