నాగచైతన్య రెండో పెళ్ళి వార్తలపై మైండ్ బ్లోయింగ్ క్లారిటీ.. శోభితతోనే ఫిక్స్.. త్వరలోనే గుడ్ న్యూస్..!?

సోషల్ మీడియాలో కథ 48 గంటల నుంచి అక్కినేని హీరో నాగచైతన్య పెళ్లి వార్త ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. అక్కినేని నాగార్జున కొడుకు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది అని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే రీసెంట్గా నాగచైతన్య పర్సనల్ టీం ఈ వార్తలపై స్పందించింది . అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది .

అయితే ఇలాంటి క్రమంలోనే అక్కినేని కాంపౌండ్ నుంచి మరో వార్త బయటకు వచ్చింది . అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంటే ..నాగార్జున మరో అమ్మాయితో పెళ్లి చేయాలని చూస్తున్నాడని .. అందుకే అక్కినేని నాగచైతన్య ఈ వార్తపై పర్సనల్ టీం ద్వారా స్పందించేలా చేశారని తెలుస్తుంది.

అంతేకాదు శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ వ్యవహారంపై ఓపెన్ గా చెప్పడానికి నాగచైతన్య ఫిక్స్ అయిపోయారట . త్వరలోనే ఈ విషయాన్ని బహిర్గతం చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున – నాగచైతన్య పేర్లు వైరల్ అవుతున్నాయి..!!!