భారీగా పెరిగిన ప్రభాస్ ఆస్తులు… ఆస్తుల విలువెంతో తెలుసా…. చూస్తే నోరేళ్ల బెడతారు…..!!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలతో భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాడు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రేంజ్ లో ప్రభాస్ పారితోషకం తీసుకున్నాడు. గత కొన్నేళ్లలో ప్రభాస్ ఆస్తుల విలువ ఊహించని స్థాయిలో పెరిగింది. తెలుగులో చాలామంది హీరోల కంటే ప్రభాస్ ఆస్తుల విలువ ఎక్కువని సమాచారం.

వారసత్వం గా కూడా ప్రభాస్కు భారీ స్థాయిలో ఆస్తులు వచ్చాయని సమాచారం అందుతుంది. ప్రభాస్ ఆస్తుల విలువ అంతకంతకు పెరుగుతుండడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషపడుతున్నారు. సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ప్రభాస్ ఆస్తులు విలువ ఏకంగా 8,000 కోట్ల రూపాయలు అని సమాచారం. ప్రభాస్ కు ఖరీదైన స్థలాలతో పాటు సొంతంగా ఫ్యాక్టరీలు ఉన్నాయని టాక్. త్వరలో పెళ్లి చేసుకుని మరో శుభవార్త చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రభాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా భారీ బడ్జెట్ సినిమాలు సక్సెస్ సాధించి ప్రభాస్ ఇమేజ్ను ఊహించని స్థాయిలో పెంచుతాయేమో చూడాల్సి ఉంది. తన సినిమాలను సరైన సమయంలో రిలీజ్ చేయడంతో పాటు…. ప్రమోషన్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే సలార్ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అయితే బాగుంటుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ త్వరలో మరికొన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.