అక్కా చెల్లెల హీరోయిన్స్ తో ఎన్టీఆర్ రొమాన్స్.. మళ్లీ బృందావనం లాంటి సీన్ రిపీట్..!!

సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఎంతోమంది హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది . అక్కల పేర్లు కూడా చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వికపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఖుషి కపూర్ బాలీవుడ్ లో ఆల్రెడీ ఓ సినిమాకి కమిట్ అయిందట.

కానీ ఆ సినిమా కన్నా ముందే తెలుగులో ఓ సినిమా ద్వారా డెబ్యూ ఇప్పించాలి అంటూ క్రేజీ డైరెక్టర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు కొరటాల శివ. ఆల్రెడీ కొరటాల శివ దర్శకత్వంలో ఖుషి కపూర్ అక్క జాన్వి కపూర్ సినిమాలో నటిస్తుంది. దేవర అనే సినిమా ద్వారా తెలుగులో డెబ్యూ ఇస్తుంది . అయితే ఇదే సినిమా ద్వారా ఖుషి కపూర్ ..ఇస్తే తెలుగులో మంచి హైప్ వస్తుందని సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది అని ప్లాన్ చేశారట .

బోనీ కపూర్ కూడా అక్కా చెల్లెలు ఒకే సినిమా ద్వారా తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేస్తే శ్రీదేవి ఆత్మ కూడా సంతోషిస్తుంది అంటూ ఓకే చేసేసారట . అయితే ఈ సినిమాలో ఖుషి కపూర్ చాలా చిన్న రోల్ ప్లే చేయబోతుంది అంటూ తెలుస్తుంది . దీంతో ఫాన్స్ ఈ అక్కాచెల్లెళ్లకు ఎన్టీఆర్ ఏ కరెక్ట్ పెయిర్ ..కచ్చితంగా ఈ సినిమా ద్వారా వీళ్ళు మంచి హిట్ అందుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!