దేవర సినిమా కి మొదట అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఎందుకు రిజెక్ట్ చేశాడంటే..!

జనరల్ గా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉంటారు. అయితే ఓ స్టార్ హీరో కోసం రాసుకున్న కథను యాక్సెప్ట్ చేసి ఫైనలైజ్ అయ్యి కాల్ షీట్స్ కూడా ఇచ్చేసాక ..మరో హీరో ఆ సినిమాలో నటిస్తూ ఉండడం అభిమానులకు ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూషన్ గా మారింది. ఆ సినిమా మరేదో కాదు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవర.

ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుంటుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు . అయితే ఈ సినిమా కథను ముందుగానే కొరటాల శివ బన్నీకు వివరించారట . బన్నీ కూడా ఈ స్టోరీ నచ్చగా కాల్ షీట్స్ కూడా ఇచ్చి సినిమా అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేశారట . కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను ఆలస్యంగా తెరకెక్కించే విధంగా మాట్లాడుకున్నారట .

ఆ మాటలు మాటలు గానే మిగిలిపోయాయి. తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేశారు బన్నీ. ఈ కథ పాత పడిపోతూ ఉండడంతో కొన్ని మార్పులు చేర్పులు చేసి తారక్ కి వివరించారు. ఆయన ఒప్పుకోవడంతో ఈ సినిమా ని మళ్ళీ సెట్స్ పైకి తీసుకొచ్చారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో .. తారక్ కి ఎలాంటి హిట్ ఇవ్వబోతుందో..?