2017 వ సంవత్సరంలో మలయాళ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. కెరియర్ మొదట్లో నుంచి తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోని నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.. అలా అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ 2019లో విశాల్ కి జంటగా నటించిన చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది..
విశాల్ హీరోగా నటించిన గట్టా కుస్తీ అని తమిళ చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది.ఈ సినిమా సక్సెస్ తో ఐశ్వర్య బిజీ హీరోయిన్గా మారిపోయింది.ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి మణిరత్నం తెరకెక్కించిన పోన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా నటించి అందరిని ఆకట్టుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె నటిగానే కాకుండా తన అందంతో కూడా మైమరిపించింది. అప్పటినుంచి తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా చేస్తూ కుర్రాలను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. నిత్యం గ్లామర్ ఫోటోలను చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపోతోంది ఐశ్వర్య లక్ష్మి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మాట్లాడిన ఐశ్వర్య లక్ష్మి.. ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత సులువు కాదని ముఖ్యంగా గ్లామర్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది.. హీరోయిన్స్ సినీ రంగంలో నిలదిక్కుకోవాలంటే టాలెంట్ తో పాటు గ్లామర్ ని ఎక్కువగా వలకబోసే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసింది తన కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసిన ఐశ్వర్య మొదట తనకు నటనపై ఇంట్రెస్ట్ లేదని డాక్టర్ కావాలనుకుని మోడలింగ్ వైపు వచ్చానని తెలిపింది.అలా కొన్ని యాడ్స్ లో నటించేటప్పుడు తనకు అవకాశం వచ్చిందని తెలిపింది.