ఆ నెగెటివిటీ చాలదని మళ్లీ కాంట్రవర్సీలకి తెర లేపుతున్న స్టార్ ప్రొడ్యూసర్..

టాలీవుడ్లో పేరున్న నిర్మాత‌ అభిషేక్ నామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ముందుగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూష‌న్ మొద‌లుపెట్టి కొన్నేళ్ల కింద‌ట దిల్ రాజు లాంటి టాప్ డిస్ట్రిబ్యూట‌ర్‌ను స‌వాల్ చేసిన ఏకైక వ్వక్తి అభిషేక్. అతను వ‌రుస‌గా పెద్ద సినిమాల‌ను భారీ రేట్ల‌కు కొని దూకుడు చూపించాడు. త‌ర్వాత నిర్మాత‌గా మారి సాక్ష్యం, గూఢ‌చారి స‌హా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఈ మధ్య అభిషేక్ నెగెటివ్ న్యూస్‌ల‌తోనే జ‌నాల నోళ్లలో నానుతున్నాడు.

‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ సినిమాకు సంబంధించి త‌న‌కు ఎనిమిది కోట్ల న‌ష్టం వ‌చ్చింద‌ని, అభిమానుల‌కు కోటి రూపాయ‌లు సాయం చేస్తాన‌ని చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌కు కూడా న్యాయం చేయాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిషేక్ ట్విట్ చేసాడు. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ట్విట్ చూసిన విజయ్ అభిమానులు ‘ఏదైనా ఉంటే నిర్మాత‌తో సెటిల్ చేసుకోవాలి కానీ,ఇలా ట్విట్ట‌ర్లో హీరోను టార్గెట్ చేయ‌డం ఏంటి ‘అని అభిషేక్ మీద తీవ్ర విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

ఇక ఇప్పుడు మ‌రోసారి అభిషేక్ కి సంబందించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిషేక్ ప్రొడ‌క్ష‌న్లో తెర‌కెక్కుతున్న ‘డెవిల్’ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. కానీ అభిషేక్ మాత్రం ద‌ర్శ‌కుడిగా త‌న పేరే వేసుకుని పోస్ట‌ర్లు రిలీజ్ చేసాడు . మొదట పోస్ట‌ర్ మీద రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్‌గా నవీన్ పేరే ఉంది. కానీ మ‌ధ్య‌లో ఏమైందో ఏమో  తెలీదు కానీ కొత్త పోస్ట‌ర్లో మాత్రం ద‌ర్శ‌కుడిగా అభిషేక్ నామా పేరు ప‌డిపోయింది. న‌వీన్ ఏమ‌య్యాడో తెలియ‌దు. ‘ఈ సినిమా కోసం నవీన్ సేవ‌లు వాడుకుని త‌ర్వాత అతని ప‌క్క‌న పెట్టేయ్యడం కరెక్ట్ కాదు ‘ అంటూ చాలామంది అభిషేక్ పై విమర్శలు కురిపిస్తున్నారు. మరికొంతమందేమో ‘అస‌లు క‌ళ్యాణ్ రామ్ ఇదంతా చూస్తూ ఎలా ఊరుకున్నాడు ‘అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.