వావ్: గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన సమంత – నాగచైతన్య సూపర్ హిట్ మూవీ.. ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత.. అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . కాగా వీళ్ళిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి . అయితే అందరికీ ఫేవరెట్ సినిమా మాత్రం ఏ మాయ చేసావే. ఇది పెళ్లికి ముందు ఫేవరెట్ సినిమా అయితే పెళ్లి తర్వాత అందరికీ నచ్చిన సినిమా మజిలీ . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును మార్చేసింది .

సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా సమంత చైతూ లో మరో యాంగిల్ బయటపెట్టింది . రియల్ లవ్ అంటే ఏంటో ఈ సినిమానే ప్రూవ్ చేసింది . అయినా ఏ, లాభం ఈ జంట విడిపోయారు. ఈ సినిమాని రీసెంట్గా మరాఠీ భాషలో రితేష్ దేశముఖ్ – జెనీలియా రీమేక్ చేసి నటించారు. కాగా తెలుగులో కంటే మరాఠీలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ వేద్ సినిమా. గిన్నిస్ రికార్డు లోకి ఎక్కింది. ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా అరుదైన ఘనత కు దక్కించుకుంది.


ఈ సినిమా రీసెంట్గా స్టార్ ప్రవాహ్ అనే ఛానల్లో టెలికాస్ట్ చేశారు . అయితే టెలికాస్ట్ ప్రీమియర్ కోసం ఏకంగా 1146 గొడుగులను లవ్ సింబల్ గా క్రియేట్ చేశారు . ఈ క్రమంలోనే వేద్ సినిమా ప్రీమియర్ కోసం ఇలాంటి పని చేసి ..గిన్నిస్ రికార్డు ల్లోకి ఎక్కారు వేద్ టీం. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది .