నేషనల్ అవార్డు విన్నర్స్.. అల్లు అర్జున్ – కృతి సనన్ కాంబోలో సినిమా వస్తుందా..?

ఇటీవల తాజాగా నేషనల్ అవార్డ్స్ అందుకున్న వారిలో అల్లు అర్జున్, కృతిస్తానన్‌ కూడా ఉన్నారు. వీరిద్దరు పేర్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతున్నాయి. కోట్లాదిమంది ప్రేక్షకుల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అల్లు అర్జున్ పుష్పా ది రైజ్‌ సినిమాలో నటనకు గాను అవార్డు రాగా, మమ్మీ సినిమాలో నటించిన కృతి స‌న‌న్‌కి ఈ సినిమా పరంగా అవార్డు వచ్చింది. అయితే వీరిద్దరూ జాతియ‌ అవార్డు అందుకున్న సందర్భంగా.. వీరిద్దరూ కలిసి నటి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

దీంతో వీరిద్దరూ కలిసి నటిస్తారా అనే అంశంపై ప్రశ్నలు మొదలయ్యాయి. దానికి తోడు కృతి సనన్‌ ఇటీవల ట్విట్ చేసిన ఒక ట్విట్ కారణమైంది. ఇటీవల ఆలియా భట్, కృతి స‌న‌న్ కూడా జాతీయ అవార్డులు అందుకోవ‌డంతో అల్లు అర్జున్ వారి ఇద్దరికీ ట్విట్టర్ వేదికగా అభినంద‌న‌లు తెలిపాడు. దానికి కృతి స‌న‌న్ రిప్లై ఇస్తూ మీకు కూడా అభినందనలు అంటూ.. పుష్పాలో మీరు అద్భుతంగా నటించారు. నేను కూడా మీకు ఓ అభిమానిని అంటూ చెప్పుకొచ్చింది.

దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ థాంక్స్.. మీ అభిమానం ఇలాగే నాపై ఉండాలని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కృతి తాజాగా ఆ ట్విట్‌కి రిప్లై ఇచ్చింది. మనిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని ఉందని మనసులో మాట వివరించింది. నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ తెరకేకిస్తున్న పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ వెల్లడించింది. దీంతో తదుపరి సినిమాలో హీరోయిన్‌గా కృతి సనన్‌ సెలెక్ట్ చేసుకోండి అన్నా అంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేషనల్ అవార్డ్స్ విన్నర్లు ఇద్దరు ఫ్యూచ‌ర్‌లో కలిసి నటిస్తారో లేదో చూడాలి.