బాలయ్య డైరెక్టర్ ని పట్టేసిన చిరంజీవి.. ఇక్కడ కూడా కాపీనేనా సార్..?

పాపం తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? మెగా హీరోలు అన్నట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో నటిస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా డిజాస్టర్ గా మారుతున్నాయి . ఈ మధ్యకాలంలో మెగా హీరోస్ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ ని నమోదు చేసుకుంటున్నాయి . అంతేకాదు డైరెక్టర్స్ ని నిట్ట నిలువున ముంచేస్తూ పెట్టిన దానికి కనీసం సగం కూడా రాకుండానే దివాలా తీసేస్తున్నాయి .

అయితే ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రూట్ మార్చారు . ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమేక్ సినిమాలపై ఫోకస్ చేసిన చిరంజీవి . ఈసారి ట్రెండ్ మారుస్తూ కామెడీ వే లో జనాలను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు. అందుకే కామెడీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన ఓ సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్ గానే చిరు పుట్టినరోజు సందర్భంగా బింబిసారా డైరెక్టర్ వశిష్టతో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ అఫీషియల్ గా ప్రకటించారు .

అయితే ఆ తరువాత బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చిరంజీవి సినిమా తీయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టే అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కలిసిన ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఇదే క్రమంలో నందమూరి ఫ్యాన్స్ చిరంజీవిని ఏకేస్తున్నారు. సినిమాలే అనుకున్నాం స్ట్రాటజీలను కూడా వేరే హీరోని కాపీ కొట్టడమేనా సార్ .. బాలయ్య ఏ డైరెక్టర్ తో తీస్తే ఆ డైరెక్టర్ తో మీరు సినిమాలు తీయ్యాలా..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!