“ప్లీజ్ నన్ను క్షమించండి”.. శ్రీలీలా మూడు పేజీల లేఖ వైరల్.. ఎందుకంటే..?

‘ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. యంగ్ బ్యూటీ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల .. ఓ విషయంలో చాలా బాధపడిందట . ఆ కారణంగానే ఏకంగా సారీ అంటూ మూడు పేజీల లేఖను రాసుకొచ్చిందట. ఆయన మరెవరో కాదు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ . ఎస్ ఇదే విషయం రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపడింది .

సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న శ్రీ లీల ప్రజెంట్ ఎలాంటి సినిమాలో నటిస్తుందో మనకు బాగా తెలిసిందే. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండే ఆల్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ బ్యూటీ.. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో శేఖర్ మాస్టర్ ని తెగ ఇబ్బంది పెట్టిందట. ఆయన చెప్పిన స్టెప్స్ రాక..ఎక్కువ టేక్స్ తీసుకున్నిందట. అలా వేరే వాళ్ల టైం వేస్ట్ చేయడం ఇష్టం లేని శ్రీలీల ఆయనకు ఇంటికెళ్లిన తరువాత సారీ అంటూ లేఖ రాసిందట.

శేఖర్ మాస్టర్ తిరిగి ఫోన్ చేసి తన తప్పేం లేదని ..తనని బాధపడొద్దని చెప్పుకొచ్చారట. ఎక్కువ మంది డ్యాన్సర్స్ ఉండటం వల్ల బ్యాక్ గ్రౌండ్ లో సరిగ్గా స్టెప్పులు వేయకపోవడంతో రీటేక్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారట. ఆ తరువాతనే శ్రీలీలా మనస్సు కుదుట పడి సెట్ అయ్యిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!