ముద్దులు పెట్టి ..హగ్గులు చేసుకుంటే సినిమా హిట్ అవుతుందా..? “ఖుషీ” సినిమాకి ఇంత చీప్ పబ్లిసిటీనా..?

ఈ మధ్యకాలంలో సినిమాలు డైరెక్ట్ చేయడం కాదు .. ఆ సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు మేకర్స్ . మరి ముఖ్యంగా కోట్లు ఖర్చుపెట్టిన ప్రాజెక్టే కాదు చాలా సింపుల్ వేలో సింపుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలను సైతం ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు . అయితే చిన్న హీరోల కన్నా స్టార్ హీరోలు ఎక్కువ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం . రీసెంట్గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత నటిస్తున్న సినిమా ఖుషి .

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ – సమంత ఏ రేంజ్ లో తిప్పలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా ఈవెంట్ లో ఏకంగా విజయ్ దేవరకొండ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకుని గిరగిరా తిప్పేశారు. ఆ తర్వాత పలుసార్లు ” నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే” అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సమంత తో కలిసి దిగిన ఫొటోస్ ని షేర్ చేశారు..సినిమా ని ప్రమోట్ చేసుకున్నాడు .

ఇప్పుడు ఏకంగా అర్ధరాత్రి పూట సమంతకు కాల్ చేసి సినిమాకు చీప్ పబ్లిసిటీని క్రియేట్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . సినిమాకి ఎప్పుడైనా హెల్తీ పబ్లిసిటీ ఉండాలని.. సినిమాలో కంటెంట్ ఉంటే ఇలాంటి చీప్ పబ్లిసిటీలు అవసరం లేదని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సినిమాలో మీరు ఎక్కడ చూసినా నటన కన్నా ఎక్కువగా రొమాన్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారని ..హగ్గులు ముద్దులు తప్పిస్తే ఆ సినిమాలో మరో పాయింట్ లేదని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి సినిమాలకు ఇప్పటికీ చాలా తేడా ఉందని ..ఒకప్పుడు కంటెంట్ నమ్ముకునే వాళ్ళని.. ఇప్పుడు కేవలం రొమాంటిక్ సీన్లు మాత్రమే నమ్ముకొని సినిమాలు తెరకెక్కిస్తున్నారని మండిపడుతున్నారు..!!