ఆ రెండు సినిమాల ఆధారంగానే తెరకెక్కిన పుష్ప… ఏవంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లో నటించిన్న అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప మూవీ లో అల్లు అర్జున్ పాత్ర అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర డిజైన్ వెనుక రెండు సినిమాలు ఉన్నాయని సమాచారం . మొదటిది విజయకాంత్ హీరో గా నటించిన ‘కెప్టెన్ ప్రభాకర్’  ,రెండవది శ్రీహరి హీరో గా నటించిన ‘పృద్వి నారాయణ ‘ .

సాధారణంగా హీరో కి విలన్ ఛాయలు చూపించే డైరెక్టర్స్ లో సుకుమార్ కూడా ఒకడు.  కెప్టెన్ ప్రభాకర్ మూవీ లో మన్సూర్ ఆలీ  ఖాన్ పాత్ర నడవడిక ,ఆహార్యం పాత్ర తీరు తెన్నులు మొత్తం గా కాపీ చేసి పుష్ప రాజ్ పాత్ర గా మార్చాడు సుకుమార్. అంతేకాకుండా కెప్టెన్ ప్రభాకర్ మూవీ లో మన్సూర్ అలీ ఖాన్ గన్ భుజం మీద పెట్టుకుని కాల్చిన విధానం కూడా వదలలేదు .కెప్టెన్ ప్రభాకర్ లో విలన్ పాత్రను పుష్ప లో హీరో పాత్రగా సుకుమార్ చిత్రికరించడమే కాకుండా మళ్లీ దీనికోసం మరో సినిమాను కూడా వాడుకున్నాడు. అదే పృద్వి నారాయణ మూవీ.

ఈ సినిమాలో ‘జారిందమ్మా జారిందమ్మా జారుపైట’ అనే  ఓ పాట మ్యూజిక్ బాగుండటం వళ్లేమో ఈమధ్య చాల చోట్ల వినపడింది .ఈ మూవీ లో శ్రీహరి డ్యూయల్ రోల్ చేసాడు. అయితే పృద్వి నారాయణ సినిమా శ్రీహరి, పుష్ప లో అల్లు అర్జున్ మాదిరిగానే భుజం జారినట్లు చెయ్యి కిందు జార్చి  నటించాడు. ఆ పాత్ర రఫ్ నెస్ కూడా పుష్ప లో అల్లు అర్జున్ పాత్రను పోలి ఉంటుంది .ఇదంతా చూస్తుంటే పుష్ప పాత్ర డిజైన్ వెనుక ఈ రెండు సినిమాలు ఉన్నాయి  అని క్లియర్ గా అర్ధం అవుతుంది. ఇందులో కెప్టెన్ ప్రభాకర్ మాత్రమే మంచి హిట్ మూవీ అయింది. పృద్వి నారాయణ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది కానీ ఆ మూవీ లో శ్రీహరి పాత్ర మాత్రం పుష్ప మూవీ కి భలే ఉపయోగపడిందనే చెప్పాలి.