భోళా శంకర్ దెబ్బతో రెమ్యూనరేషన్ భారీగా తగ్గించిన చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వర్సెస్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చిరుకి అంతగా కలిసి రావడం లేదని చెప్పాలి. చిరంజీవి తీసిన సినిమాలన్నీ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ అవుతున్నాయి. పైగా ఇవన్నీ రీమిక్ సినిమాలు కావడం గమనార్హం. తాజాగా వచ్చిన భోళాశంకర్ సినిమా కూడా రిమెకే.. డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Bhola Shankar: Pre Look Poster Featuring Chiranjeevi Is Out! - Filmibeat

దీంతో మెగా అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో చిరుకి చెడ్డ పేరు రావడమే కాక నిర్మాత అనిల్ సుంకరకు కూడా భారీ నష్టాలు తెచ్చి పెట్టింది. అసలే ఏజెంట్ సినిమా ఫ్లాప్ కావడంతో నష్టాల్లో ఉన్న అనిల్ సుంక‌ర‌కి భోళా శంకర్ సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. అలాగే భోళా శంకర్ ఎఫెక్ట్ ప్రస్తుతం చిరు రమ్యునరేషన్ మీద కూడా పడిందట. నిజానికి ప్రతి మూవీకి చిరంజీవి రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. సినిమా బడ్జెట్ రూ100 నుంచి రూ120 కోట్లు అవుతూ ఉంటుంది. అయితే బిజినెస్ మాత్రం రూ.100 కోట్లు దాటకపోవడంతో నిర్మాతలకు టెన్షన్ స్టార్ట్ అయింది.

Shockingly low promotions for Bhola Shankar

చిరు వరుస ఫ్లాపులకు రీమేక్లు కూడా కారణమని చెప్పవచ్చు. ఇక చిరంజీవి నటించబోయే సినిమాలకు రూ.50 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఆలోచిస్తున్నారు.. దీంతో చిరంజీవి కూడా రెమ్యూనరేషన్ కాస్త తగ్గించారఅట. రూ.30 నుంచి రూ.35 కోట్లలోపు రమ్యునరేషన్ మాత్రమే తీసుకోవడానికి చిరంజీవి అంగీకరించినట్టు న్యూస్ వైరల్ అవుతుంది. ఇకపై రీమిక్ సినిమాలు కాకుండా స్ట్రెయిట్ కథలను మాత్రమే ఎంచుకుంటూ సినిమాల్లో చిరు నటించబోతున్నాడు.. అంటూ న్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కథలో కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు స్క్రీన్ వైపు తలెత్తి కూడా చూడరని భోళా శంకర్ నిరూపించింది.