జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన బేబీ .. పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అప్పటివరకు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. పలు కవర్ సాంగ్స్ చేసిన బ్యూటీగా సోషల్ మీడియా స్టార్ గా పేరు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య .. బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య . ఈ సినిమా ద్వారా హ్యూజ్ సక్సెస్ ని అందుకుంది .

ఈ సినిమా పెట్టిన దానికి ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ లాభాలు తీసుకొచ్చింది . అంతేకాదు ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ నటించినా.. క్రేజ్ మొత్తం బేబీ పాత్ర పోషించిన వైష్ణవి చైతన్య ఎగరేసుకుపోయింది . కాగా ఇప్పటికే వైష్ణవి చైతన్య ఖాతాలో రెండు బడా సినిమాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది . ఒకటి అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ తో కలిసి నటించే సినిమా .. మరొకటి రామ్ పోతినేని తో కలిసి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “”డబుల్ ఇస్మార్ట్ సినిమా… ఈ రెండు సినిమాలపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు .

కానీ సోషల్ మీడియాలో మాత్రం బేబీ జాక్పాట్ ఆఫర్ అందుకుంది అన్న వార్త వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరో నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం అందుకు నిందట బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య . నిజానికి ఆ రేంజ్ స్టేటస్ బేబీకి లేదు. కానీ తెలుగు అమ్మాయి కావడంతో ఛాన్స్ ఇస్తే సినిమాకి సైతం పబ్లిసిటీ వస్తుంది అన్న కారణంతో ఆ హీరో స్పెషల్ గా వైష్ణవి చైతన్య పేరుని ఆరోల్ కి సజెస్ట్ చేశారట . దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఇది నిజంగానే దక్కిన ఆఫరా..? లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా అన్నది తెలియాల్సి ఉంది..!!ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తుంది.