ఆనంద్, విరాజ్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన వైష్ణవి చైతన్య..!!

బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పాపులారిటీ దక్కించుకున్న వైష్ణవి చైతన్యకి ప్రస్తుతం వరుస సినిమాల ఆఫర్లు క్యూక‌టాయి అంటు న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ 2లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించబోతుందట.

Vaishnavi Chaitanya: Age, Photos, Biography, Height, Birthday, Movies,  Latest News, Upcoming Movies - Filmiforest

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆహా ఓటిటి వాట్సప్ బేబీ పేరుతో వైష్ణవికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా వైష్ణవికి కొన్ని ఆశ‌క్తిక‌ర‌ ప్రశ్నలు ఎదురయ్యాయి. అవి ఏంటంటే ఆనంద్ విరాజ్‌లతో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని చేసుకుంటావు..? అంటూ ఇంటర్వ్యూ వర్‌ అడిగారు. వైష్ణవి ఇద్దరినీ చేసుకోను అని వెల్లడించింది. ఇద్దరిలో నచ్చే ఒక్కొ క్వాలిటీని ఈమె చెప్పకొచ్చింది.

Baby' Beauty Faces Awkward Q; Answers Like A Pro

ఈ మూవీలో వైష్ణవి చేసింది కరెక్టేనా..? అని వైష్ణవిని అడగ్గా ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని మనకు మనం లిమిట్స్ పెట్టుకోలేము కదా.. సందర్భాన్ని బట్టి ఆ టైంలో ఏమనిపిస్తే బేబీ అది చేసింది.. అని సమాధానం ఇచ్చింది వైష్ణవి. ఇక చివరిగా మీకు వైష్ణవి పాత్ర నచ్చిందా..? అని అడగ్గా ఎంతో బాగా నచ్చింది అంటూ సమాధానం చెప్పింది. ప్రస్తుతం వైష్ణవి చెప్పిన ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.