బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు.. ఇప్పటికీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలకు వ్యాఖ్యాతగా చేస్తూ అదే విధంగా హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఇదే సమయంలో సుధీర్ పెళ్లి అనగానే ప్రతి ఒకరికి గుర్తుకొచ్చే పేరు రష్మీ.
వీరిద్దరికీ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా సుధీర్‌ను.. మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని ప్రశ్నించగా.. అసలు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉంటే కాబోయే భార్యలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పగలను.. కానీ నాకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమం లేదు.
నిజంగా పెళ్లి చేసుకువాలనే వారికి మాత్రం చాలా కూల్ గా హ్యాపీగా నవ్వుతూ ఉండే అమ్మాయి దొరికితే చాలు.. ఇంకేమీ అవసరం లేదు అంటూ చెప్పుకోవచ్చాడు. అయితే ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదు అంటూ ఈ సందర్భంగా సుధీర్ పెళ్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే సుదీర్ ప్రస్తుతం తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ఉన్నారు.