యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌కి ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాలు బోర్ కొట‌వ‌ట‌..!!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కృష్ణంరాజు వారసుడుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా అడుగు పెట్టాడో లేదో అలా పాన్ ఇండియా హీరోగా నిలిచాడు. ఇక ఇప్పుడు సినిమాలను చాలా సెలెక్టివ్ గా చేస్తున్నాడు. ప్రభాస్ తన వ్యక్తిగత విషయాలు, అభిరుచుల గురించి మీడియాతో మాట్లాడటం అరుదు. తనకు అత్యంత ఇష్టమైన సినిమాల గురించి ప్రభాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఎక్కువ యాక్షన్ సినిమాలే చేసే ప్రభాస్ కు వ్యక్తిగతంగా మాత్రం కామెడీ చిత్రాలంటే ఎక్కువ ఇష్టమని చెప్పాడు.

అలా చూసిన వాటిలో రాజేంద్రప్రసాద్ చిత్రాలే చాలా ఉన్నట్లు తెలిపాడు. ఇక మోడ్ర్న్ సినిమాల్లో తనకు పోకిరి అంటే చాలా ఇష్టమని.. అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని.. అలా వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పాడు. అలాగే ఇడియట్ సినిమా కూడా చాలాసార్లు చూశానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప్రభాస్ కు అత్యంత ఇష్టమైన రెండు సినిమాలు కూడా పూరి జగన్నాథ్‌వే కావడం విశేషం.

మరోవైపు తన సినిమాల్ని తాను చూడడానికి అసలు ఇష్టపడనని ప్రభాస్ తెలిపాడు. ఏ సినిమా చూసినా.. అందులో లోపాలే కనిపిస్తాయని.. ఇక్కడ ఇలా ఉండాల్సింది కాదు. ఇలా చేయాల్సింది కాదు అనిపిస్తుందని అందుకే తన సినిమాలు ఏవైనా టీవీలో వస్తున్న కూడా ఛానల్ మార్చేస్తానని ప్రభాస్ చెప్పాడు. బాహుబలి సినిమాను ఒక్కసారి మాత్రమే థియేటర్లో చూసుకున్నానని.. మళ్లీ ఈ మధ్యే హోమ్ థియేటర్లో ఒకసారి చూశానని ప్రభాస్ వెల్లడించాడు.