ఆ యంగ్ హీరోయిన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభాస్..

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ తరువాత రవితేజ ‘ధమాకా’ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. శ్రీలీల రెమ్యునరేషన్ సినిమాను బట్టి కోటి రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుంది. శ్రీలీల డిమాండ్ చేస్తే మరింత ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీలీలకు డార్లింగ్ ప్రభాస్ భారీ షాకిచ్చారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా మేకర్స్ మొదట శ్రీలీల పేరును పరిశీలించారని అయితే చివరకు నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారని సమాచారం. ఈ విధంగా శ్రీలీల ఆఫర్ ను నిధి సొంతం చేసుకుందని తెలుస్తోంది. మరి ఈ వార్త గురించి శ్రీలీల నుంచి ఎలాంటి రియక్షన్ వస్తుందో చూడాలి. ఇండస్ట్రీ లో శ్రీలీల రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో అయిన ప్రభాస్ కు జోడీగా ఛాన్స్ వస్తుందేమో చూడాలి. ఇప్పటికే శ్రీలీలతో కలిసి నటించిన హీరోలు చాలా మంది ఆమెతో మళ్లీమళ్లీ కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మరో మూడేళ్ల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల హవా చూపించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాబోయే రోజుల్లో శ్రీలీల మరిన్ని విజయాలను అందుకుంటే ఇతర భాషల దర్శకనిర్మాతలు సైతం శ్రీలీల నామస్మరణ చేసే ఛాన్స్ అయితే ఉంది. శ్రీలీల ఇప్పటికే ఇతర భాషలకు సంబంధించిన కొన్ని ఆఫర్లను రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం శ్రీలీల విశ్రాంతి లేకుండా పని చేస్తోంది. నెలకో సినిమా చొప్పున రాబోయే ఐదు నెలలు శ్రీలీల బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతుందని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో శ్రీలీల క్రేజ్, పాపులారిటీ వేరే లెవెల్ ఉన్నాయి. ఆమె టాలెంట్ కు, లక్ కూడా తోడు కావడంతో ప్రస్తుతం వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి అని ఇండస్ట్రీ వర్గాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.