నాచురల్ స్టార్ నాని – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ మూవీ.. ఆ డైరెక్టర్ తోనే..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టార‌ర్ మూవీ హ‌వా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీనియర్ హీరోతో యంగ్‌ హీరోస్ కూడా మల్టీస్టారర్ మూవీ నటించి బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటించారంటే ఖ‌చ్చితంగా సినిమా హిట్ అవుతుందని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కాంబోలో సినిమా రాబోతుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Unstoppable With Balakrishna: Actor Nani Chief Guest - Chitrambhalare

నాచురల్ స్టార్ నాని – నందమూరి నట‌సింహం బాలయ్య ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నారట. ఇక బాలయ్య పై తన అభిమానాన్ని నాని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాడు. బాలయ్య అభిమానిగా నాని ఓ సినిమాలో కూడా నటించాడు. అన్ స్టాప‌బుల్ బేదిక‌పై బాలయ్యను కలిసిన నాని తన అభిమానాన్ని వివరించడంతోపాటు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

From Assistant Director To a Filmmaker, The Inspiring Journey of Anil  Ravipudi - News18

ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే అనిల్ రావిపూడికి నాని – బాలయ్య కాంబినేషన్లో ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందట. దీంతో షూటింగ్.. ఫ్రీ టైం లో బాలయ్యను కలిసి అనిల్ స్టోరీ లైన్ చెప్పాడని.. అది విన్న బాలయ్య కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అట‌. కథ స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు నేను సినిమా చేయడానికి రెడీ అని బాలయ్య చెప్పినట్లు తెలుస్తుంది. ఇక బాలయ్య భగవంత్ కేసరి తర్వాత చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అనీల్ అని న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో చిరు అనిల్ రావిపూడి కాంబినేషన్ తరువాత నాని – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ మూవీ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.