ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు ఫస్ట్ ఛాయిస్ చిరంజీవినా..? సమంత తో అలాంటి సీన్స్ రాశారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సినిమాల చూసింగ్ విషయంలో ది పర్ఫెక్ట్ గా ఆలోచించే మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తన బాడీ మోడ్లేషన్ కి తగ్గ కథలను చూస్ చేసుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువగా రీమిక్ సినిమాలపై ఫోకస్ చేస్తూ ఉండడంతో ఆయన ఖాతాలో వరుసగా డిజాస్టర్లు పడుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఓ సూపర్ డూపర్ వెబ్ సిరీస్ ని మిస్ చేసుకున్నాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది.

స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఈ విషయాన్ని బయట పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయినా సమంత లైఫ్ కోలాప్స్ అయిపోయింది . ఈ సినిమా లో నటించిన కారణంగానే నాగచైతన్య – సమ్మత విడిపోయారు అంటూ ఇప్పటికీ ప్రచారం జరుగుతుంది. అయితే నిజానికి మేకర్స్ ఈ సిరీస్ ను మొదటగా సినిమా రూపంలోతెరకెక్కించాలి అనుకున్నారట . ఇదే కథను అశ్విని దత్ దగ్గరికి తీసుకెళ్లారట .

అశ్వినిదత్ చిరంజీవి నటిస్తే బాగుంటుంది అంటూ ఆయన వద్దకు వెళ్లి స్టోరీ వివరించారట . అయితే అప్పుడే ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకున్న చిరంజీవి ఇలా ఇద్దరు పిల్లలకు తండ్రిగా కనిపిస్తే మెగా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు అన్న భయంతో రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ కథను వెబ్ సిరీస్ గా మార్చి సమంతతో తెరకెక్కించారు . అయితే వెబ్ సిరీస్ లో సైతం చిరంజీవి నటిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు మేకర్స్ చేసారట . కానీ అందుకు కూడా చిరంజీవి రిజెక్ట్ చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఒకవేళ చిరంజీవి ఇందుకు యాక్సెప్ట్ చేసి ఉంటే కచ్చితంగా సమంతతో కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించాల్సివుండేది. దీంతో సోషల్ మీడియాలో చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు అంటున్నారు అభిమానులు..!!