మన్మధుడు మూవీకి ముందు తరుణ్ హీరో అనుకొని..నాగార్జునను హీరోగా ఎందుకు తీసుకున్నారో తెలుసా..!?

అక్కినేని అందగాడు నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. అంతకుముందు త్రివిక్రమ్ నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చవు వంటి సినిమాలకు కూడా కథ,మాటలు అందించారు. ఈ సినిమాలతో పాటు మరో రెండు కథలను తన దగ్గర ఉన్నాయని నువ్వు నాకు నచ్చావ్ ద‌ర్శ‌కుడు విజయ్ భాస్కర్‌కు చెప్పాడట త్రివిక్రమ్.

Tarun: పెళ్లి కొడుకు అవుతున్న తరుణ్.. అమ్మాయి ఎవరంటే..? | Actor Tarun Kumar marriage confirmed and here the bride details pk– News18 Telugu

అయితే ఆదర్శకుడు అందులో ఏదో ఒక కథతో త్రివిక్రమ్‌ని దర్శకత్వం వహించమని సలహా కూడా ఇచ్చాడట. ఇక త్రివిక్రమ్ నువ్వే నువ్వే కథకు తరుణ్ హీరోగా బాగుంటాడని అలా ఆ స్టోరీ తో నువ్వే నువ్వే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత దర్శకుడు విజయభాస్కర్ కి త్రివిక్రమ్‌ మన్మధుడు స్టోరీ చెప్పాడు. అయితే అంత‌కు ముందు త్రివిక్ర‌మ్‌ త‌న తోలి సినిమాలో హీరోగా న‌టించిన త‌రుణ్‌తో మ‌న్మ‌ధుడు సినిమా చెయ్య‌లి భావించారు.

ఇక త‌ర్వాత త‌న గురువు విజ‌య‌భాస్క‌ర్ చెప్పిన విధంగా నాగార్జునను కలిసి త్రివిక్రమ్- విజయభాస్కర్ మా దగ్గర మంచి కథ ఉంది సార్.. ఆ స్టోరీకి మీరు మాత్రమే సూట్ అవుతారు కొంచెంం వింటారా..? అని అడిగారట.. వెంటనే నాగార్జున ఒప్పుకుని కథ విన్నారట. ఇక త్రివిక్రమ్ కథ చెప్పగానే నాగార్జునకు కొత్తగా ఆశ్చర్యంగా అనిపించింది. స్టోరీని రెండు గంటలసేపు విన్న తర్వాత కానీ నాగార్జునకి కథ మొత్తం అర్థం కాలేదు. కథ‌ చాలా బాగా రాశారని సినిమాకు ఓకే చేశాడు నాగార్జున. ప్రొడ్యూస్ గురించి మీరేం ఇబ్బంది పడొద్దు.. ఈ సినిమాను స్వయంగా మా అన్నపూర్ణ బ్యానర్ నుంచి నేనే ప్రొడ్యూస్ చేస్తానని హామీ కూడా ఇచ్చారట.

Manmadhudu Title Song || Manmadhudu Movie || Nagarjuna, Sonali Bendre,  Anshu - YouTube

ఇక మీరు ఈ సినిమాలో మిగతా న‌టి నటులను సెలెక్ట్ చేసుకోండని హామీ ఇచ్చారట. ఈ సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి, సంగీత దర్శకుడుగా దేవి శ్రీ ప్రసాద్‌ని సెలెక్ట్ చేశారు. మిగిలిన పాత్ర అన్నిటికీ ఆయా కాస్టింగ్ అనుకొని షూటింగ్ మొదలుపెట్టారు. ఇందులో నాగార్జున హాస్పిటల్ సీనన్ ను హైదరాబాద్ లోని ఇందిరానగర్ లోని ఉషా ముళ్లపూడి ఆసుపత్రిలో చిత్రీకరించారు. క్లైమాక్స్ సీన్స్ పశ్చిమ గోదావరిలో తీశారు. ఫైనల్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న మన్మథుడు డిసెంబర్ 20, 2002న థియేటర్లోకి వ‌చ్చింది.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ అందరినీ ఆకట్టుకుంది. సునిల్ కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతం అనే చెప్పాలి. త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో త్రివిక్రమ్ తెలుగు సినిమాకి కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఈ సినిమాతోనే నాగార్జునకి మన్మథుడు అనే ట్యాగ్ లైన్ వచ్చి చేరింది. ముఖ్యంగా అప్పటికి.. ఇప్పటికీ ఎవ్వర్ గ్రీన్ సినిమా మన్మథుడు అని తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.