పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రమ్యకృష్ణ..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకొని హీరోయిన్ రమ్యకృష్ణ..ఎన్నో చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించిన రమ్యకృష్ణ ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది.. బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న రమ్యకృష్ణ ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. తన కెరీర్ లోనే ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోలందరితో కూడా నటించింది.

అయితే ఇటివలె రమ్యకృష్ణ పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. తాజాగా ఈ విషయం పైన ఆమె స్పందిస్తూ ఇటీవలే విడుదలైన జైలర్ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో నటించింది.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాయి.. స్నేహితురాలు మినిస్టర్ రోజా ఇంటికి వెళ్లడం జరిగింది.ఇక అప్పటి నుంచే రమ్యకృష్ణ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపించాయి..

ఈ విషయంపై తాజాగా రమ్యకృష్ణ మాట్లాడుతూ రోజా నేను చాలా మంచి స్నేహితులు అప్పుడు ఎలా ఉండే వాళ్ళము ఇప్పుడు కూడా అలాగే ఉన్నాము చాలా ఏళ్ల తర్వాత నేను తిరుపతికి వెళ్లాను అక్కడ దర్శనం మంచిగా అవ్వడానికి కారణం రోజానే చాలా మంచి దర్శనం చేయించింది.. అందుకే ఆమెకు థాంక్స్ చెప్పాలని నేను కూడా ఇంటికి వెళ్లి మరి కలిసానని తెలిపింది ..మేం పాలిటిక్స్, సినిమాలు ఏవి మాట్లాడుకోలేదు.. కేవలం పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయం గురించి మాట్లాడుకున్నాము పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పాలి అంటే ఒకరిని చూసి రాజకీయాలలోకి రావాలని ఇంట్రెస్ట్ రాకూడదు.. ఎవరికి వాళ్ళ ఆసక్తిగా ఉండాలి అని తెలిపింది. రోజా కష్టపడింది ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉంది.. భవిష్యత్తులో ఏదైనా పార్టీలో చేరతానో లేదో అని కూడా చెప్పలేను.. వచ్చినప్పుడు చూద్దామని తెలిపింది రమ్యకృష్ణ.