మొక్కజొన్న పీచును పడేస్తున్నార.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలిస్తే అవాక్ అవుతారు..!!

మన శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమే.. వాటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాంటి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒక‌టి. మన శరీరంలో రక్తాన్ని ఇవి వాడిపోస్తూ ఉంటాయి. ఇందులో ఉండే మలినాలను బయటకు పంపిస్తూ ఉంటాయి. ఇది ఆరోగ్యంగా ఉండటం మనకి చాలా ముఖ్యం. కానీ చాలామంది మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు.

రక్తంలో మలినాలు, విష పదార్థాలు ఎక్కువ అవ్వడం వల్ల మూత్రపిండాలలో రాళ్ల ఏర్పడుతున్నాయి. మూత్రంలో క్యాల్షియం, పొటాషియం, ఆక్సలేట్, యాసిడ్ వంటివి ఉంటాయి. ఈ రాళ్లు క్ర‌మంగా పెద్దవి అయ్యి తీవ్రమైన నొప్పికి దారితీస్తాయి. కిడ్నీలో రాళ్లను కరిగించే నేచురల్ టిప్ ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లును తొలగించడంలో మొక్కజొన్న పీచు ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో మినరల్స్, విటమిన్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

మొక్కజొన్న పీచుతో టీ నీ తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 4 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో ఒక మొక్కజొన్న పీచును వేసి నీళ్లు సగం అయ్యేవరకు మరగనివ్వాలి. తర్వాత ఈ నీటిని వడకట్టుకుని తీసుకోవాలి. తర్వాత వీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, 2 టీ స్పూన్ ఆలివ్ నూనె వేసి కలపాలి. తర్వాత చేసుకున్న నీటిని ఉదయం సాయంత్రం రెండు పూటలా భోజనం చేసిన తర్వాత తాగాలి. ఇలా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.