ఎన్టీఆర్‌కు మూడ్‌ బాగోకపోతే రూమ్ లోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని అలాంటి పని చేస్తాడా..!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇది పేరు కాదు ఒక బ్రాండ్.. నటరత్న ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్.. తన బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగులోనే యంగ్ టైగర్ గా త‌నకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. గొప్ప నటుడుగా, గొప్ప డాన్సర్ గా, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఎందరో కోట్లాదిమంది గుండెల్లో ముద్ర వేసుకున్నాడు.

Jr NTR indirectly talks about being trolled for 'fake accent' at Golden Globes - Hindustan Times

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్‌లు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫా అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు.

ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ పరుస షెడ్యూల్ తో దేవర షూటింగ్ జరుగుతుంది. వచ్చే ఏడాది సమర్ కానుకగా ఏప్రిల్ 5 ప్రేక్షకుల ముందుకు తీసుకురన్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే… స్టార్ హీరోలు, సెలబ్రిటీలు అన్నాక‌ ఎన్నో టెన్షన్లు, ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు తప్పు చేయకపోయినా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి ప్ర‌శంసించిన వారే మరోసారి ఘోరంగా అవమానిస్తూ ఉంటారు.

Jr NTR fans shower love on the mass hero as RRR mania grips Japan. Watch - India Today

ఇలాంటి పలు అనుకొని కారణాలవల్ల మూడాఫ్‌లు, చికాకులు సెల‌బ్రెటీల‌కు చాలా కామ‌న్‌. అయితే మ‌న ఎన్టీఆర్‌కు మూడ్ బాగోపోతే ఏం చేస్తాడో తెలుసా..? రూమ్ లోకి వెళ్లి ఒంట‌రిగా సినిమాలు చూస్తాడ‌ట‌. సినిమాలు చూస్తే ఎన్టీఆర్ మెద‌డు, మ‌న‌సు రీఫ్రెష్ అవుతాయ‌ట‌. మూడ్ వెంట‌నే ఛేంజ్ అవుతుంద‌ట‌. గ‌తంలో ఓ మూవీ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు మ‌రోసారి నెట్టింట వైర‌ల్ గా మారాయి.