“భయపడకండి..అలా చేయను”..ఫ్యాన్స్ కి శ్రీలీల గుడ్ న్యూస్.. ఇక పండగే పండగ..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల.. ప్రెసెంట్ ఎంత సెన్సేషన్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఉండే ఆల్ మోస్ట్ అందరి హీరోల తో నటిస్తుంది. కాగా తాజాగా మరోసారి రవితేజ తో మరో ఆఫర్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

వీరసిమ్హా రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వీళ్లిద్దరు ఓ సినిమాకు కమిట్ అయ్యారట. ధమాకా సినిమాతో క్రజీ రికార్డ్ ని సెట్ చేసిన ఈ జంట మరోసారి అలాంటి రికార్డులే క్రియేట్ చేయబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈమధ్య కాలంలో శ్రీలీల సినీ ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పబోతున్నట్లు ప్రచారం జరిగింది.

ఎగ్జామ్‌స్ ఉన్నాయని ..వాటికి ప్రీపేర్ అవ్వడానికి బ్రేక్ చెప్పబోతుంది అన్న న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే . కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీ లీల తన ఎగ్జామ్ రాస్తూనే సినిమా షూట్స్ లో పాల్గొనాలని డిసైడ్ అయిందట. తన వల్ల మేకర్స్ సిబ్బంది పడకూడదు అనే కన్సర్న్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు శ్రీ లీల తీసుకున్న డెసిషన్ పై మేకర్స్ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఓ హీరోయిన్ కి ఉండాల్సిన ప్రధాన క్వాలిటి అదే అంటున్నారు. అయితే తన తల్లి మాత్రం పూర్తి కాన్సన్ట్రేషన్ స్టడీస్ పైనే చేయాలి అంటూ చెప్పుకొస్తుందట . మొత్తానికి అభిమానులను మరోసారి తన నిర్ణయంతో సాటిస్ఫై చేసింది శ్రీలీల..!!